నాగ చైతన్య సమంత విడాకులపై స్పందన – నిజమైన కారణం ఏంటి?

టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య తన మాజీ భార్య సమంతతో విడాకుల గురించి తొలిసారి ఓపెన్ అయ్యారు. ‘Raw Talks With VK’ పోడ్కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా, విడాకులపై స్పందిస్తూ, ఇది తమ ఇద్దరి పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు.

Naga Chaitanya on Divorce with Samantha
Naga Chaitanya on Divorce with Samantha

ఇది మా ఇద్దరి మధ్య ఉన్న నిర్ణయం

చైతన్య మాట్లాడుతూ, “మేమిద్దరం మన జీవితాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తిగా మా వ్యక్తిగత నిర్ణయం. ఒకరిపై ఒకరు గౌరవాన్ని కొనసాగిస్తూ, విడిపోవడం మంచిదని భావించాం,” అని పేర్కొన్నారు. అయితే, ఈ విషయాన్ని మీడియా గాసిప్‌గా మార్చడం తనకు బాధ కలిగించిందని అన్నారు.

విడాకుల నిర్ణయం వెయ్యి సార్లు ఆలోచించాం

తండేల్ సినిమా ప్రమోషన్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య, విడాకుల నిర్ణయం తేలికగా తీసుకోలేదని తెలిపారు. “ఇలాంటి నిర్ణయాన్ని ఓవర్ నైట్‌లో తీసుకోలేం.

మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. మా జీవితాలను ముందుకు నడిపించుకునేందుకు ఇదే సరైన మార్గమని అనుకున్నాం,” అని వివరించారు.

సోభితకు సంబంధం లేదు

చైతన్య, సమంతతో తన విడాకులకు సోభిత ధూళిపాళ్ కారణమని వస్తున్న వదంతులను ఖండించారు. ‘నా విడాకులకు సోభితకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టంగా చెప్పారు. “సోభితకు నా గతంతో ఎలాంటి సంబంధం లేదు.

మా పరిచయం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రారంభమైంది. ఆమెను విమర్శించడం అన్యాయం. ఆమె తప్పు చేసిందేమీ లేదు,” అని స్పష్టం చేశారు.

నేను క్రిమినల్ లా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?

తన కుటుంబం నుంచి వచ్చిన అనుభవాల నేపథ్యంలో, తన పెళ్లి విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకున్నానని చెప్పారు. “ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా, విడాకుల ప్రభావం నాకు తెలుసు. కానీ ప్రజలు, మీడియా దీనిని మామూలు విషయం కాదని చర్చించడం, వ్యక్తిగత జీవితాన్ని ఎంటర్టైన్మెంట్‌గా మార్చడం బాధాకరం,” అని అన్నారు.

ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన కెరీర్, సినీ పరిశ్రమలో నెపోటిజం (వంశపారంపర్యత్వం), తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ చూడొచ్చు.

ఇలాంటి తాజా సినీ మరియు ట్రెండింగ్ వార్తల కోసం tbreaknews.in ను ఫాలో అవండి!

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *